మేము చేస్తే అప్పు,
మీరు చేస్తే ఒప్పు!
నువ్వు చేసిన తప్పు, మేము చేశావు అంటావు ట్రంపు!
పన్ను మీద పన్ను అంటివి, చమురు అని సాకు చూపి!
అదే చమురు కొంటున్న, కొన్ని రోజుల తరువాత పన్ను అంటివి, నువ్వు శత్రువు అని చెప్పే చైనా మీద.
ఏలా? భయమేల?
ఎందుకేలా, ఎందుకేలా. ఈ పేరు ప్రఖ్యాతి ఆకలి!
స్వార్థమన్నది ముదురుతున్నది. ఇది తగదు అధ్యక్షులకన్నది!
ఇది అన్నది, తరగక పోతే, కరగక పోతే!
కక్ష కోపములు పెరిగి పెరిగి విప్లవమగును ప్రజల్లోన, ప్రజల్లోన!
ఇది తెలుసుకో అధ్యక్షుడా, మరి ఒక్కసారి!
చెప్పినా పరవాలేదు, ప్రజలకు దేశాలకు మరి ఒక్క “సారి!”
తెలుసుకో అధ్యక్షుడా, తెలుసుకో!

Leave a comment