ఓ మేఘమా!
చెప్పవోయ్, ఈ కారానికి ఉన్న రుచి ఏమిటని?
తల్లి పుత్రుని మీద పెంచుకున్న మమకారానికి,
యుద్ధం జరుగుతూ బాంబులు పేలుతూ మధ్య ఉన్న జన సమూహ హాహాకారానికి,
ప్రక్కన ఎదుగుతున్నవాడిని చూసి ఒర్వలేకపోతున్న మానవ ఆహంకారానికి,
భారతీయులు భగద్వీయులు మానవులకి చేయుచున్న ఉపకారానికి,
దుష్టశక్తులు, తంత్రయుక్తులు మనుషుల మనుగడకు చేస్తున్న అపకారానికి,
పట్టణంలో పట్టం కట్టే పొట్ట కొట్టే దళారుల అధికారానికి,
ఏ రహదారి చూసినా ఏ సందు నడిచినా చెత్త ఉన్న ఈ సంస్కారానికి,
చెప్పు! చెప్పవోయ్ మేఘమా! ఈ కారానికి ఉన్న రుచి ఏమిటని!

Leave a comment