ఓ హిమాలయ బుల్ బుల్,
విహరించు అంతటా నీకు నచ్చిన ఇళ్లటా,
నదుల మీద కొండల మీద,
ఋతువులు మారినా రూపం మారని ఋషికేష్ మీద,
కనిపించినదా పరమార్థం,
ఆత్మజ్ఞానం అయినదా నీవు ధరతి మీదకు వచ్చిన కారణం,
శివుని తలనుంచి వచ్చిన గంగ పరవళ్ళు తొక్కిన ప్రాంతం,
ఎన్నెన్ని జన్మలు ఎత్తినా అందదు ఈ దర్శన పుణ్యం!
ఓ హిమాలయ బుల్ బుల్,
పైపైకి ఎగురు పతంగు లాగ,
కనిపించినదా జార్జి ఎవరెస్టు శిఖరం,
కిందకు చూస్తే దూన్ లోయ,
పక్కకు చూస్తే హిమాలయ,
ఆహా! ఏమి ఈ చల్లటి గాలినాదం!
కాదనలేరెవ్వరు, ఈ అమితానందం!
ఓ హిమాలయ బుల్ బుల్,
ఇది మా భారతఖండం,
దీనికి సాటిలేదన్నది లేదని ఒప్పుకున్నది ఈ బ్రహ్మాండం!

Leave a comment